kyan వాడకం అనేది ప్రస్తుతం బోధనలో భాగంగా మారింది. అటువంటి kyan యొక్క ఉపయోగాలు మరియు వాడకం తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. చాలా తక్కువ శ్రమతో ఎక్కువ లాభదాయకంగా బోధించవచ్చని మీరు తెలుసుకుంటారు . మీకోసం kyan గురించి సమగ్ర సమాచారం మరియు kyan వాడకానికి సంబందించిన వీడియోలు కూడా అందుబాటులోకి తేబోతున్నాము .
FRONT VIEW OF KYAN
లెఫ్ట్ సైడ్ ఇచ్చిన పటంలో 1 అనేది ప్రొజెక్టర్ లెన్స్ ని తెలియ జేస్తుంది. kyan వాడకంలో లేనపుడు ప్రొజెక్టర్ లెన్స్ ని లేన్సే కవర్ తో మూసి ఉంచాలి.
2 అనేది DVD RAM DRIVE ని తెలియజేస్తుంది. దీని ద్వారా మనం CD లేదా DVD లను READ కాని WRITE కాని చేయవచ్చు.
TOP VIEW OF THE KYAN
పక్క పటంలో 1 అనేది ప్రొజెక్టర్ on మరియు OFF చేయడానికి మరియు ప్రొజెక్టర్ ని కంట్రోల్ చేయడానికి వాడతారు.
2 అనేది ఫోకస్ కంట్రోలర్ . ప్రొజెక్టర్ నుండి వచ్చే బొమ్మను సరిగ్గా ఫోకస్ అయ్యే విదంగా సెట్ చేసుకోవడానికి వాడతారు. తద్వారా బొమ్మ క్లారిటీ గా కనిపించేలా చేసుకోవచ్చు.
3. ఇది పవర్ బటన్. kyan ని on మరియు ఆఫ్ చేయడానికి వాడతారు.
4. వాల్యూం కంట్రోల్. సౌండ్ పెంచడానికి తగ్గించడానికి మరియు మ్యూట్ చేయడానికి సంబందించినవి ఇక్కడ ఉంటాయి.
REAR VIEW OF THE KYAN(kyan వెనుక వైపు):
పై పటంలో 1 అనేది AUDIO AMPLIFIER తో కూడిన స్పీకర్లు .
2 వది POWER SOCKET. దీని ద్వార మనం kyan కి కరెంటు కనెక్షన్ ఇస్తాము .
3 అనేది USB PORTS . మొత్తం 6 ఉంటాయి. దీని ద్వారా USB PORT సపోర్ట్ చేసే ఏ డివైసు అయిన మనం కనెక్ట్ చేసుకోవచ్చు.
4 అనేది ETHERNET PORT . దీని ద్వారా మనం BROADBAND లేదా ఇతర నెట్వర్క్స్ ని kyan కి కనెక్ట్ చేయవచ్చు.
5 అనేది AUDIO PORTS. వీటిలో AUDIO INPUT, AUDIO OUTPUT, MIC అనే మూడు ఉంటాయి . వీటిని మనం సందర్భానుసారంగా వినియోగించవచ్చు.
6 అనేది VGA PORT. దీనిని వేరొక మానిటర్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
ప్రొజెక్టర్ తో పాటు మానిటర్ లో కుడా చూడటానికి పనికొస్తుంది.
kyan PACKAGE లో క్రింది పరికరాలు మనకు ఇవ్వబడతాయి.
వీటితో పాటు కొన్ని BATTERIES కూడా ఇవ్వబడతాయి.
kyan లో వినియోగించే SOFTWARE CD లు లేదా డీవీడీ లు కూడా ఇవ్వబడతాయి .
ఇది kyan కి సంబందించిన HARDWARE సమాచారం. kyan ని ఎలా అమర్చాలో తెలుసు కొవాలంటే click here
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment