LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Saturday 30 November 2019

Teachers Information System (TIS) Online Application Submission date has been extended up to 10-12-2019 -*



టీచర్స్ డీటెయిల్స్ వచ్చే  నెల 10వ తేదీ నాటికి పొడిగించారు . కావున మిత్రులంతా ఈ క్రింది వివరాలని సిద్ధం చేసుకొని అవకాశం ఉన్న చోట పూర్తి చేసుకోగలరు. ఒక ఉద్యోగి వివరాలు ఆన్లైన్ లో సమర్పించడానికి సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.....                              ఎంప్లాయి డేటా లాగిన్ అయినాక , మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు ట్రెజరీ ఐ డి  అడుగుతుంది... మన మొబైల్ కి OTP వస్తుంది.....

1) వ్యక్తిగత వివరాలు నింపవలసి ఉంటుంది  ,గతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి దాదాపు అన్ని save అయి ఉన్నాయి. కొత్తగా తండ్రి పేరు , పాన్ నెంబర్ , ఉద్యోగి ప్రస్తుత మరియు శాశ్వత చిరునామా  నమోదు చేయవలసి ఉన్నది.

(2)విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి......                      ఇందులో 10th, ఇంటర్ , డిగ్రీ , పీజీ , బీఎడ్ వివరాలు నమోదు చేయాలి. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతలలో తెలుగు మీడియం చదివిన వారందరూ పదో తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని రాయాలి , ఇంటర్మీడియట్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని రాయాలి  .... బోర్డు పేరు,  మెమో నంబర్ , హాల్ టికెట్ నెంబర్ , పాస్ అయిన నెల , మరియు సంవత్సరం , పొందిన మార్కులు , మొత్తం మార్కులు నింప వలసి ఉంటుంది. డిగ్రీ  విద్యార్హతలు నింపేటప్పుడు పై వివరాలతో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ అడుగుతున్నది. అందరికీ కామన్ గా మూడు ఆప్షనల్ సబ్జెక్టులు  ఉంటాయి , కొందరు అదనపు విద్యార్హత కోసం నాలుగవ ఆప్షనల్ పూర్తి చేస్తారు. నాలుగవ ఆప్షనల్ సబ్జెక్ట్ లేనివారు None అని  పూర్తి చేయాల్సి ఉంటుంది. పీజీ మరియు బీ.ఈడి  విద్యార్హతలకు కూడా పై విధంగానే వివరాలు నింపాల్సి ఉంటుంది...

(3) అపాయింట్మెంట్ వివరాలు...... అపాయింట్మెంట్ వివరాలు నింపేటప్పుడు DSE OR DEO ద్వార అనేది తెలుపవలసి ఉంటుంది.మొదటి నియామకం కాబడిన టువంటి ప్రస్తుత జిల్లా మరియు మండలం పాఠశాల పేరు నింప వలసి ఉంటుంది..

(4) డిపార్ట్మెంట్ టెస్ట్ వివరాలు....... డిపార్ట్మెంటల్ టెస్ట్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు నింప వలసి ఉంటుంది.  

(5) ప్రమోషన్ వివరాలు..... ప్రమోషన్ వివరాలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా మరియు  స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ పొందిన వారు మాత్రమే నింపాల్సి ఉంటుంది. SGT ఉపాధ్యాయులు నింపవలసిన అవసరం లేదు...

(6) ట్రాన్స్ఫర్ వివరాలు......                  ఇందులో మొదట ఇంటర్ డిస్ట్రిక్ట్ మరియు 610 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయుల వివరాలు నింపాల్సిన అవసరం ఉంటుంది. అనంతరం జనరల్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుంది. ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినామో సంఖ్య తెలపాలి. మనం 1st అపాయింట్ మెంట్ అయిన పాఠశాల తేదీ నుండి ఎప్పటివరకు పనిచేశామొ ఆ తేదీ వరకు మొదటి ట్రాన్స్ఫర్ గా గుర్తుంచుకోగలరు ట్రాన్స్ఫర్ డేటాలో ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది.... ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో మన ప్రస్తుత పాఠశాల వివరాలు అవసరం లేదు.

(7 ) హెల్త్ కార్డుల వివరాలు......               మొదట మన హెల్త్ కార్డు నంబర్ తెలుపవలసి ఉంటుంది. తర్వాత మన పైన ఆధారపడిన వారి హెల్త్ కార్డుల గురించి వివరాలు తెలుపాల్సి ఉంది . పై వివరాలను వరుసక్రమంలో నింప వలసి ఉంటుంది . ఇందులో డిపెండెంట్ పేర్లు , డేట్ అఫ్ బర్త్ , ఆధార్ కార్డు నెంబర్  , మరియు డిపెండెంట్ అందరివి హెల్త్ కార్డులు అప్లోడ్ చేయవలసి ఉంటుంది....

(8) సంపాదిత సెలవుల మరియు OCL వివరాలు....          వీటికి సంబంధించి సాఫ్ట్ వేర్ ఇంకా అప్డేట్ చేయవలసి ఉన్నది కావున ప్రస్తుతం ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు .........

Mancherial- zphs sirsa school ranked 4th place in national science drama festival


Kumrambheem- District science fair schedule released

💐జిల్లా విద్యాశాఖ కుమరం భీం అసిఫాబాద్💐
తేదీ 02.12.2019 నుండి 03.12.2019 వరకు JNNSME EXHBHITION-19 FATIMA CONVENT HIGH SCHOOL,KAGAZNAGAR నందు నిర్వహించబడును.
ప్రధానోపాధ్యాయులు గమనించి పై anexure లోని ఉపాధ్యాయులను తేదీ 02.12.19 న ఉదయం 8AM కు జిల్లా విద్యాశాఖ అధికారికి  సకాలంలో report చేయగలరని కొరనైనది.
💐DEO KBASF💐


Mancherial--జిల్లా స్థాయి సైన్స్ exibition 2019 షెడ్యూల్ విడుదల

🌹🌈☄🌹🌈☄: 🌈🌈 *డిసెంబర్ 4,5వ తేదీలలో జిల్లా* *స్థాయి* *సైన్స్* *ఎగ్జిబిషన్*( *JNNSMEE* *2019* ) 🌈🌈 జిల్లా స్థాయి సైన్స్ ఏక్సిబిషన్  *కార్మెల్ ఉన్నత పాఠశాల, మందమర్రి నందు డిసెంబర్ 4,5తేదీలలో* నిర్వహించబడును. సైన్స్ ఎక్సిబిషన్ లో పాల్గొనేవారు తప్పని సరిగా  ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి 

https://forms.gle/MrL5d6nHCUwxX1uk7
✍" *గూగుల్ ఫార్మ్* " ✍
Fill చేసి మీ *ఎగ్జిబిట్స్* ను తేదీ 02/12/19 మ. 2గంటల లోపు తమ ప్రాజెక్ట్స్ *రిజిస్ట్రేషన్* తప్పక చేసుకోవాలి. 
👉ఇంతకు ముందర ఈ లింక్ ద్వారా చేసిన వారు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. 
👉 ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే  రిజిస్ట్రేషన్ కౌంటర్లో మీ పూర్తి వివరాలు ఉంటాయి. మీరు మీ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తే చాలు.అందరికి చాలా సులభతరం. 👉TLM ప్రదర్శన ఉపాధ్యాయులకు మాత్రమే.. కొంత మంది tlm వారి విద్యార్థుల చేత రిజిస్ట్రేషన్ చేయించారు. విద్యార్థుల చేత సృజనాత్మకమైన ప్రాజెక్టులు రూపొందించాలి.
అందరూ సన్నద్ధం కావాలని కొరదమైనది.
👍 జిల్లా విద్యాధికారి, మంచిర్యాల 💐


autadd

RECENT POSTS

Recent Posts Widget