*💠👩🏫ఆ టీచర్ల వివరాలు పంపండి*
*⏺ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2004కు ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తర్వాత కొలువులో చేరిన వారి వివరాలను ఈ నెల 10లోపు పంపాలని సమగ్ర శిక్షా అభియాన్ సహాయ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు పీవీ శ్రీహరి డీఈవోలను ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన వారి వివరాలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల నుంచి డీఈవోలు తెప్పించుకొని సమర్పించాలని ఆయన సూచించారు. కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారు పాత పింఛను పథకం పరిధిలోకి రానున్నారు. వారికి ఆ పథకాన్ని వర్తింపజేసేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారు.*
No comments:
Post a Comment