పాఠశాల అకడమిక్ క్యాలెండర్ 2019-20 విడుదల
👉 ఆర్.సి నం 90,తేది 11.06.2019
👉 HS పని వేళల్లో ఎలాంటి మార్పు లేదు
👉 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. 2020 ఏప్రిల్ 23 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 2019 సెప్టెంబర్ 28 నుంచిఅక్టోబర్ 13 వరకు దసరా సెలవులు, 2020 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
👉 పాఠశాల వేళలు
ఇక, పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
👉 పరీక్షలు
ఎఫ్‌ఏ -1 పరీక్షలు జూలై 31న షె డ్యూల్ విడుదల కానుంది. ఎఫ్‌ఏ -2 సెప్టెంబర్ 27న, సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 అక్టోబర్ 21 నుంచి 26వరకు జరుగుతాయి. ఎఫ్‌ఏ -3 నవంబర్ 30న, ఎఫ్‌ఏ-4 జనవరి 31 లోపు పదో తరగతి వరకు, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వారికి ఫిబ్రవరి 29 లోపు నిర్వహించాలి.
👉 పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 29లోపు నిర్వహిస్తారు. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు మార్చి 2019లో నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 7 నుండి 16 2020లోపు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ2 పరీక్షలు నిర్వహించి, 10న ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించాలనీ, 11న తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని, 12న ప్రోగ్రెస్ కార్డుల ను విద్యార్థుల నుంచి తీసుకోవాలని అకడమిక్ క్యాలెండర్‌లో షెడ్యూల్ పొందుపర్చారు.
👉 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను(ఆరు) జూన్, అక్టోబర్, మార్చి నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నిర్వ హించాలని సూచించారు.పాఠశాల వార్షికోత్సవాలను జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించుకోవాలనీ, *బాల సభలను ప్రతి నెలా మొదటి శనివారం జరపాలనీ, ప్రతి శుక్రవారం రోజున మాస్‌డ్రిల్, యోగా కార్యక్రమాలు* నిర్వహించాలని క్యాలెండర్‌లో పేర్కొన్నా రు.
👉సిలబస్
జనవరి 31లోగా పదో తరగతి సెలబస్ పూర్తి చేసి, ఫిబ్రవరి నుంచి రివిజన్ క్లాసులు నిర్వహించాలని, 9వ తరగతిలోపు సెలబస్‌ను ఫిబ్రవరి 28 వరకు పూర్తిచేయాలని సూచించారు.
👉క్రీడలు
స్కూల్ స్థాయి క్రీడలు ఆగస్టు రెండో వారం లోపు, వరకు జిల్లాస్థాయి పోటీలు సెప్టెంబర్ 3వ వారం లోపు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్‌లో సూచించారు.
👉 డిజిటల్ తరగతులు
డిజిటల్ తరగతులను పదో తరగతి వారికి 10.40 గంటలకు రెండో, తొమ్మిదో తరగతి వారికి మూ డో పీరియడ్‌గా 11.40 గంటలకు, 8వ తరగతి వారికి 5వ పీరియడ్‌లో 1.50 గంటలకు, 7వ తరగతి వారికి ఆరో పీరియడ్ 2.40 గంటలకు, ఆరో తరగతి వారికి ఏడో పిరియాడ్‌లో 3.30 గంటలకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment