*💥ఎన్‌టీఎస్‌సీ దరఖాస్తుకు 29 తుది గడువు*
♦జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌సీ) రాష్ట్రస్థాయి పరీక్ష నవంబరు 4న జరగనుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 29 లోగా ఆన్‌లైన్ bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్ తెలిపారు.
*♦‘నేషనల్’ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి*
🔷నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత సాధించిన విద్యార్థులు 2018-19 సంవత్సరానికి అక్టోబరు 31వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్ తెలిపారు. అర్హత పొందిన వారి వివరాలను bse.telangana.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచామని, వారు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ సంఖ్యకు అనుసంధానం చేయాలని సూచించారు. సందేహాలకు 9701678786, 9052003330, 9247834799 లకు ఫోన్ చేయవచ్చన్నారు.
No comments:
Post a Comment