తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన ఉపాధ్యాయ బదిలీల లోపాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం బదిలీలల్లో 100 శాతం ట్రాన్స్పరెన్సీ తేవడంకోరకు వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది . గతంలో రోజుల తరబడి జిల్లా కేంద్రంలో ఉండి అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ లో పాల్గొనే పరిస్థితులు తప్పినందుకు సగటు ఉపాధ్యాయుడు సంతోష పడుతున్నాడు .
బదిలీల్లో వేల సంఖ్యలో బోగస్ సర్టిఫికెట్స్ ఉంటాయన్న సంగతి వెబ్ కౌన్సిలింగ్ తో ప్రపంచానికి అర్ధం అయ్యింది. ఇప్పటికి రోడ్డు లేని పాటశాలలు ఒక్క సారిగా పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలోకి మారితే ఇదేమి విచిత్రమని ఒక్కసారిగా అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ విధానం కొనసాగితే ఉపాధ్యాయుల బదిలీలు ఎటువంటి లోపాలు లేకుండా జరుగుతాయని అందరు భావిస్తున్నారు.
కొన్ని గంటల పాటు ఇంట్లో కూర్చొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ప్రస్తుతం సులభంగా ఉందని గతంలో రోజుల తరబడి జిల్లా కేంద్రంలో పిల్లలు మరియు కుటుంబం తో ఉండి అర్దరాత్రి వరకు కౌన్సేల్లింగ్ లో పాల్గొనడం కష్టంగా ఉండేదని చాలా మంది ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు . ఈ విదానం తీసుకు రావడంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు చేసిన కృషిని వారు అభినదిస్తునారు.
వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు పారదర్శకంగా జరగడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు , ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు .
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment