*💥‘నా ఓటు’.. వివరాలన్నీ యాప్‌లో!
App download link. DOWNLOAD
*🔹పోలింగ్‌లో పాల్గొనడాన్ని సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు తాజాగా ‘‘నా ఓట్’’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్ దీన్ని ఆవిష్కరించారు. అనంతరం అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ఆమ్రపాలి మాట్లాడుతూ..‘‘గూగుల్ ప్లేస్టోర్ (లేదా) యాప్ స్టోర్ నుంచి ‘నా ఓటు’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేరు, ఓటరు ఐడీ(ఎపిక్) నెంబరుతో ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నాం. కేంద్రానికి ఎలా చేరుకోవాలనే రూట్‌మ్యాప్. క్యాబ్, ఆటో, బస్సుల్లో వెళ్తే ఎంత సమయం పడుతుంది. దగ్గరల్లోని రవాణా సదుపాయం ఏదీ? దివ్యాంగ ఓటర్లైతే రవాణా సౌకర్యం, సహాయకులు కావాలని కోరడం.. తదితర సౌకర్యాలను యాప్ ద్వారా పొందవచ్చు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, ఎన్నికల అధికారుల వివరాలనూ తెలుసుకోవచ్చు. నా ఓట్ అనే పేరు, అర్థం వచ్చేలా యాప్ లోగో తయారు చేయడానికి పోటీ నిర్వహిస్తున్నాం. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో ఎవరైనా లోగో రూపొందించవచ్చు. డిసెంబరు 6లోగా డిజైన్లను -naavotets@gmail.com కు మెయిల్ చేయాలి. విజేతకు రూ.15,000 బహుమతి అందజేస్తాం’’ అని చెప్పారు.*
App download link DOWNLOAD
LATEST NEWS
Search This Blog
deoasfad1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment